![]() |
![]() |
.webp)
బీబీ జోడి లేటెస్ట్ ప్రోమో కలర్ ఫుల్ గా రిలీజ్ ఐపోయింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో "ప్రాపర్టీస్ రౌండ్" ఇచ్చిన ప్రాపర్టీని యూజ్ చేసుకుంటూ కంటెస్టెంట్స్ డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రోమో చూస్తే అవినాష్ ఆర్జీవీ అవతారం ఎత్తాడు. అచ్చంగా ఆయన వాయిస్ నే ఇమిటేట్ చేస్తూ "ఈ డంబుల్ వాడుతూ అమ్మాయితో జిమ్ చేయాలనిపిస్తోంది" అని చెప్పేసరికి శ్రీముఖి వెంటనే "ఇనాయ ఆజా" అని ఆమెను పిలిచింది. "ఇనాయని చూసి అవినాష్ కళ్ళు మూసుకునేసరికి నన్ను చూసి మాటలు రావడం లేదనుకుంటా" అని కౌంటర్ వేసింది. ఇక ఆ కౌంటర్ కి రివర్స్ కౌంటర్ వేసి "ఏమన్నా చేయాలనిపిస్తోంది" అన్నాడు అవినాష్. దాంతో స్టేజి మొత్తం కేకలు పెట్టింది. ఇక అవినాష్ ఇనాయ చేతికి డంబుల్ ఇచ్చి ఆమెతో ఎక్సరసైజ్ చేయించాడు. దాంతో "అదేంటి నాతో చేయిస్తున్నావ్ ఆరియానా కదా చేయాల్సింది" అంది ఇనాయ. దీంతో అందరూ నవ్వేశారు.
తర్వాత జోడీస్ అన్నీ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ తో ఎంటర్టైన్ చేశాయి. ఇక భానుశ్రీని అవినాష్ సరిగా డాన్స్ స్టెప్ ని ఇమిటేట్ చేయకపోయేసరికి లాగి పెట్టి చెంప మీద ఒక్కటిచ్చింది. ఫైనల్ గా అఖిల్-తేజస్వి జోడి అలాగే, అవినాష్-ఆరియానా జోడి వేసిన డాన్స్ తో స్టేజి మొత్తం వేడెక్కిపోయింది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కి మిగతా జోడీస్ చాలా తక్కువ మార్క్స్ ఇచ్చేసరికి వాళ్ళ మధ్య పెద్ద డిబేట్ జరిగింది. ఇంతలో అవినాష్ " మా డాన్స్ లో ఎక్కడ సింక్ మిస్ అయ్యిందో చెప్పాలి...అలా గుర్తు లేకుండా మర్క్స్ ఎలా ఇస్తారు" అని జడ్జిగా ఉన్న రాధను అడిగేసరికి అవినాష్ అడిగింది కరెక్టే..సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మార్క్స్ వేసే వారి మీదే ఉంది అని చెప్పారు.
![]() |
![]() |